twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి చేసిన గూగుల్ తల్లి, జబర్దస్త్ యాంకర్ ఆగ్రహం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్ కామెడీ షో' అనే కార్యక్రమానికి యాంకరింగు చేస్తున్న రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెక్సీగా, చలాకీగా యాంకరింగు చేస్తూ ఈ కామెడీ ప్రోగ్రాంకి గ్లామర్ టచ్ ఇస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో ప్రేక్షకులను కవ్విస్తోంది. రష్మి కేవలం యాంకర్ మాత్రమే కాదు, జబర్దస్త్ కంటే ముందే ఆమె పలు చిత్రాల్లో నటించింది.

    రష్మికి బాగా గుర్తింపు, పాపులారిటీ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కార్యక్రమమే అని చెప్పక తప్పుదు. ఈ కార్యక్రమం వల్లనే ఆమె సెలబ్రిటీ హోదా సొంతం చేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా.....పాపులారిటీ ఉన్నపుడే ఫాలోయింగ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రష్మి.....సోషల్ నెట్వర్కింగు ద్వారా హాట్ ఫోటోలు, ఆసక్తికర ఫోటోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

    కాగా ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ మూలంగా రష్మి గౌతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెకు ఇంకా పెళ్లి కాక పోయినా....నాయిద్రువరెడ్డితో పెళ్లయినట్లు గూగుల్ సెర్చ్ లో చూపిస్తోంది. దీంతో రష్మి గూగుల్ తల్లిపై గుర్రుగా ఉంది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, గూగుల్ సెర్చింజన్లో తన గురించి వచ్చే సమాచారం నమ్మవద్దని అభిమానులను కోరుతోంది.

    రష్మి గురించి ఇలా...

    రష్మి గురించి ఇలా...


    గూగుల్ సెర్చ్ ఇంజన్లో రష్మి గౌతం గురించిన సమాచారం ఇలా దర్శనమిస్తోంది.

    రష్మి లుక్

    రష్మి లుక్


    యాంకరింగు, నటన మాత్రమే కాకుండా మోడలింగు రంగంలో కూడా రష్మి పని చేసింది. రష్మికి సంబంధించిన హాట్ లుక్ ఫోటో.

    రోజాతో కలిసి

    రోజాతో కలిసి


    జబర్దస్త్ కార్యక్రమంలో నటి రోజాతో కలిసి స్టెప్పులేస్తున్న యాంకర్ రష్మి.

    ముద్దు మద్దుగా...

    ముద్దు మద్దుగా...


    రష్మి ఏప్రిల్ 7, 1989లో ఒరిస్సాలో జన్మించింది. మోడలింగ్ రంగం నుండి ఎంటర్టెన్మెంట్స్ రంగం వైపు అడుగులు వేసిన రష్మి యాంకర్‌గా, నటిగా తన ప్రస్తానం సాగించింది.

    టీవీ షోలు...

    టీవీ షోలు...


    2007లో ‘యువ' అనే టీవీ కార్యక్రమంలో రష్మి నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘జబర్దస్త్ కామెడీ షో'లో యాంకరింగు చేస్తోంది. సూపర్ కుటుంబం అనే కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేస్తోంది.

    English summary
    Rashmi Gautam fuming on most popular search engine Google. When reasoned it was found that Google search results shows the actress to be already married to one 'Naidruva Reddy’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X