అన్యాయం: ‘గోపాల గోపాల’ బెనిఫిట్ షో రేటు అంతా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ‘గోపాల గోపాల' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు లేటవుతుండటం వల్ల ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. అన్నీ సక్రమంగా పూర్తయితే రేపు(జనవరి 9) విడుదల కావాల్సి ఉంది. లేటు కారణంగా జనవరి 10 లేదా 11న విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా....గోపాల గోపాల బెనిఫిట్ షోలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని బ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బినిఫిట్ షో ప్లాన్ చేస్తున్నారు. టిక్కెట్లు కూడా అమ్మకానికి రెడీ అయ్యాయి. బ్రమరాంబ థియేటర్లో ఉదయం 5 గంటలకు, మల్లికార్జున థియేటర్లో ఉదయం 5.30 బెనిఫిట్ షో వేయబోతున్నారు. బాల్కనీ టికెట్ రేటు రూ. 3 వేల నుండి 5 వేలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ క్లాస్ టికెట్ రేటు రూ. వెయ్యి నుండి 2 వేలు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం అన్యాయమని పేద ప్యాన్స్ అంటున్నారు.

'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











