అదే డేట్ ఫైనల్ చేసారు..పవన్ ఓకే చేసారు

By Srikanya

హైదరాబాద్ : వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌మరార్‌, సురేష్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం మొదటనుంచీ అనుకుంటున్నట్లుగానే సంక్రాంతి రోజు అంటే జనవరి 15న విడుదల చేయటానికే తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సైతం ఈ తేదికి ఓకే అన్నట్లు తెలుస్తోంది.

హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రానికిది రీమేక్‌. పవన్‌ కల్యాణ్‌ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

'Gopala Gopala' Gets Release Date

దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్‌ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.

సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X