సెకండ్ లుక్: పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కిన ఫ్యాన్ (వీడియో)
హైదరాబాద్: ‘పవనిజం' పేరుతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మేనియాను వ్యాపింప చేసిన పవర్ స్టార్ అభిమానులు సెన్సేషన్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పవనిజం అనేది మా మతం...పవన్ కళ్యాణ్ మా దేవుడు అని కొలిచే అభిమానులు ఎందరో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' చిత్రం నటిస్తున్న నేపథ్యంలో క్రియేటివ్ ఐడియాతో ముందుకొచ్చారు కొందరు అభిమానులు. సెకండ్ లుక్ పేరుతో ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
‘గోపాల గోపాల' సినిమా విషయానికొస్తే....
హిందీలో విజయవంతమైన ‘ ఓ మైగాడ్ ' చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ గోపాల గోపాల '. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఊయలలో ఊగుతున్న కృష్ణుడిలా ఉన్న పవన్‌ను వెంకటేష్ అనుకరించడం ఈ పోస్టర్‌లోని విశేషం. కిషోర్ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అనుప్‌రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్ మరారీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని, దీక్షాపంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారణాశిలో పది నుంచి పన్నెండు రోజుల వరకూ షూట్ ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందరి ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌లో టాక్ వినబడుతోంది.


Click it and Unblock the Notifications











