‘గోపాల గోపాల’ ఆడియో రిలీజ్ డేట్

By Bojja Kumar

హైదరాబాద్: ‘గోపాల గోపాల' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం ఆడియో జనవరి 1న అనుకున్నారు కానీ వీలు కాలేదు. తాజాగా జనవరి 4న ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ‘గోపాల గోపాల' చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ ‘భజే భజే' నూతన సంవత్సరం కానుకగా లహరి మ్యూజిక్ వారు యూట్యూబులో విడుదల చేసారు.

జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

Gopala Gopala Movie Audio Release Date

ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

వివాదం..
‘పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రం ప్రోమో ఇటీవల టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. శ్రీకృష్ణుని వేషధారణతో అసభ్యంగా నాట్యాలు చేస్తూ, వినోదం కోసం దేవుళ్ల వేషధారణ వేయడంపై ఈ రోజు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాం. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రం ప్రివ్యూ కూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది' భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X