వీడని వివాదం: ‘గోపాల గోపాల’ కలెక్షన్లపై ఎఫెక్ట్?
హైదరాబాద్: ‘గోపాల గోపాల' చిత్రం ఈ రోజు విడుదలై అభిమానులు, ప్రేక్షకులు ఆదరణను చూరగొంటున్న సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసకుంది. అయితే సినిమాపై వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మధ్య వివాదాల పాలైన సినిమాలు కలెక్షన్లు బాగా సంపాదించాయి. ‘పికె' చిత్రంపై పలు మత సంస్థలు చేసిన ఆందోళన ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అయ్యాయనే వాదన కూడా ఉంది. ఫలితంగా ఆ చిత్రం వందల కోట్లు రూపాయల కలెక్షన్ సాధించింది. తాజాగా ‘గోపాల గోపాల' విషయంలోనూ అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని రఘునాథరావు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. సినిమా విడుదల రోజే ఆయన ఫిర్యాదు చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఫిర్యాదు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాల్సిందే.

గత వివాదాలు
విడుదలుక ముందు నుండే...‘గోపాల గోపాల' చిత్రంపై ఆందోళనలు సాగాయి. ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రాన్నికూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేసారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











