పూర్తి వినోదాత్మం: కాంబినేషన్ కేక...(గోపాల గోపాల ప్రివ్యూ)

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గోపాల గోపాల' చిత్రం శనివారం గ్రాండ్‌గా విడుదలవుతోంది. హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. వెండి తెరపై పవన్ కళ్యాణ్ అభినవ కృష్ణుడిగా చేసిన లీలలు చూసేందుకు, దేవుడిని నమ్మకుండా వెటకారంగా వెంకీ చేసిన పనులు, చివరకు అతనిలో మార్పుకు దారి తీసిన పరిస్థితులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఎన్నో వైవిధ్యమైన పాత్రల ద్వారా అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులు ఆదరాభిమానాలను చూరగొన్న విక్టరీ వెంకటేష్‌ - పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజాగా నటించిన ‘గోపాల గోపాల' విడుదలకు ముందే సంచలనాలు సృష్టించింది. విక్టరీ అభిమానులు - పవర్‌స్టార్‌ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ‘గోపాల గోపాల' ప్రభంజనంగా అత్యద్భుత విజయం సాధించడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు..

డా॥ డి. రామానాయుడు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్స్‌పై కిషోర్‌కుమార్‌ పార్ధసాని దర్శకత్వంలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ సురేష్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే హిందీ వెర్షన్ తో పోలిస్తే....తెలుగులో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి ఎక్కుగా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు పవన్ కళ్యాణ్ పాత్ర ఎంటరవుతుంది. సెకండాప్ మొత్తం సాగుతుంది. ఆయన పాత్ర మొత్తం 50 నిమిషాలపైనే ఉండనుంది.

తెలుగు నేటి విటీకి తగిన విధంగా సినిమాలో చాలా మసాలా యాడ్ చేసారు. హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా కామెడీకి పెద్ద పీఠ వేసారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కథ విషయానికొస్తే...
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు.

దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? అనే ఆసక్తికరమైన ఈ కథాంశంతో సినిమా సాగుతుంది. మరికొన్ని గంటల్లో సినిమా పూర్తి రివ్యూ మీ ముందుకు.

Gopala Gopala movie preview

నటీనటులు: మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు.
కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల
స్క్రీన్‌ప్లే : కిశోర్‌కుమార్ పార్థసాని భూపతిరాజా, దీపక్‌రాజ్
కెమెరా: జయనన్ విన్సెంట్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: అనూప్ రూబెన్స్
పాటలు:చంద్రబోస్
ఎడిటింగ్: గౌతమ్‌రాజు
ఆర్ట్: బ్రహ్మ కడలి
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్
దర్శకత్వం: కిశోర్ పార్థసాని(డాలీ).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X