గోపాలా గోపాలా: పవన్ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెడుతున్నారు

By Bojja Kumar

హైదరాబాద్: తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అనుకున్న సమయానికి సినిమా రావడం లేదనే వార్త వింటే అంతకంటే ఎక్కువ టెన్షన్ పడతారు. తాజాగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాలా గోపాలా' చిత్రం విషయంలో అదే జరుగుతోంది.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పొడక్షన్ టీం నుండి ఆ మధ్య సంకేతాలు అందాయి. దీంతో సంక్రాంతి పండగ మరింత ఆనందమయం అవుతుందని అభిమానులు ఆశ పడ్డారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

Gopala Gopala Not for Sankranthi?

అనుకోని కారణాలతో షూటింగ్ ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరో నెల రోజుల షూటింగ్ మిగిలి ఉందని, షూటింగ్ పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని, ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా సంక్రాంతికి విడుదలవ్వడం కష్టమే అని అంటున్నారు.

హిందీ హిట్ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో, వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తారు. శ్రీయ వెంకటేష్ భార్య పాత్రలో నటిస్తోంది. సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X