ఇప్పుడు పవన్ ఇంట్రడక్షన్ జరుగుతోంది

By Srikanya

హైదరాబాద్ : వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ హీరోలుగా 'గోపాల గోపాల' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో పవన్‌ కల్యాణ్‌ ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం పవన్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ను రూపొందించారు. వాటిపై పవన్‌ ప్రయాణించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. శరత్‌మరార్‌. సురేష్‌బాబు నిర్మాతలు.

దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ...దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? హుండీలో డబ్బులెందుకు వేయాలి? హారతి ఇవ్వకపోతే దేవుడు మొర ఆలకించడా? ఇలాంటి సవాలక్ష సందేహాలున్నాయి అతనికి. దేవుడుంటే ఈ సృష్టినంతటినీ సమానంగా చూడాలి కదా? ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే బేధాలెందుకు అంటూ స్వామీజీలనూ తన పశ్నలతో హడలెత్తించాడు. జవాబులు దొరకలేదు. చివరికి సమాధానం ఇవ్వడానికి స్వయంగా శ్రీకృష్ణుడే దిగొచ్చాడు. ఆ వైనం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'.

'Gopala Gopala': Now pawan Kalyan's Introduction Song

''బాలీవుడ్‌లో విజయం సాధించిన 'ఓ మైగాడ్‌' చిత్రానికిది రీమేక్‌. తెలుగు వాతావరణానికి వెంకీ, పవన్‌ల శైలికి తగినట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్‌ పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి'' అని నిర్మాతలు చెబుతున్నారు. మిథున్‌ చక్రవర్తి, దీక్షాపంత్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.

ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X