twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వారం నుంచీ పవన్ సీన్ లోకి వస్తారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ సెట్లో ఉంటే ఆ ఎట్మాస్మియరే వేరు అంటారు ఆయనతో పనిచేసిన వాళ్లు . చాలా క్రమశిక్షణగా ఉండే ఆయన సెట్లో ఉంటే సెట్ మొత్తం ఎలర్ట్ గా ఉంటుంది. మిగతా ఆర్టిస్టులు సైతం సింగిల్ టేక్ ఆర్టిస్టులుగా మారిపోతారు. ఆయన తాజాగా నటిస్తున్న 'గోపాల గోపాల' సెట్లోకి ఈ వారంలో అడుగుపెట్టనున్నారు. దాంతో యూనిట్ మొత్తం దానికి సంభందించిన ప్రిపరేషన్ లో మునిగిపోయారు. ఇంతకు ముందు సైతం ఈ చిత్రం కోసం ఆయనపై కొన్ని సన్నివేశాలు తీసారు. ఇప్పుడు ఆయనపై వెంకీ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    దర్శకుడు కిషోర్ పార్దసాని డైరక్షన్ లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వెంకటేష్‌, శ్రియ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలో పవన్‌ కల్యాణ్‌ చిత్ర బృందంతో కలుస్తారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ''బాలీవుడ్‌ చిత్రం 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌ ఇది. వెంకటేష్‌, పవన్‌ పాత్రలు మనసుకు హత్తుకొంటాయి''అని నిర్మాతలు చెప్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...నిజం వేరు.. నమ్మకం వేరు. రెండింటి మధ్య స్పష్టమైన గీత ఉంది. భక్తి ఆ గీతను చెరిపేస్తుంది. నాస్తికులు మాత్రం అదే గీతను భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. మనం నమ్మేవన్నీ నిజాలు కావు, దేవుడిపై మనకున్నది నమ్మకం కాదు, భయం అని మరో వాదన లేవదీశాడొకాయన. నలుగురి మధ్యో, నాలుగు గోడల లోపలో ఈ ప్రశ్న లేవనెత్తలేదు. ఏకంగా న్యాయస్థానంలోనే చర్చకు తెరలేపాడు. ఆ తరవాత ఏమైందో? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చిందెవరో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌ పార్థసాని (డాలీ).

    Gopala Gopala on fast track – Pawan to join shoot in this week

    చిత్రం కథ విషయానికి వస్తే..

    దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'.

    బిజినెస్ విషయానికి వస్తే...

    పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

    అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

    అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Pawan Kalyan and Venkatesh’s first multi starrer Gopala Gopala shoot is on fast track. Pawan will join the unit in couple of days and this shooting will continue for a week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X