‘గోపాల గోపాల’ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. సినిమా విడుదలైన ప్రతిచోట సందడి వాతావరణం నెలకొంది. మరో నాలుగు రోజుల వరకు దాదాపు అన్ని థియేటర్లలో టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి.
సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉందని, అదే సమయంలో సందేశాత్మకంగా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్న మాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య సాగే సన్నివేశాలు బావున్నాయని అంటున్నారు. రీమేక్ సినిమా అయినప్పటికీ పూర్తి తెలుగుదనంతో కూడుకుని ఉందని, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని అంటున్నారు జనాలు.

ఫస్ట్ డే రెస్పాన్స్ చూసి నిర్మాతలు చాలా ఆనంద పడుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందనే అంచనాలు వస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి ‘గోపాల గోపాల' చిత్రం ఈ సంక్రాంతికి తెలుగు సినీ పరిశ్రమలో ఆనందకమైన వాతావరణం నెలకొనేలా చేసింది.
గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











