పవన్-వెంకటేష్ ‘గోపాలా గోపాలా’ మరింత వెనక్కి?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రం విడుదల మరింత ఆలస్యం కాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ సంవత్సరం దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఫ్యామిలీ సబ్జెక్టుతో కూడిన సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ కావడంతో ఫుల్ స్వింగ్‌తో పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి.


Click it and Unblock the Notifications











