‘గోపాలా గోపాలా’ రిలీజ్ డేట్ ప్రకటించిన సురేష్ బాబు
హైదరాబాద్: ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ‘గోపాలా గోపాలా' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే అయోమయంలో ఉన్న అభిమానులకు తీపి కబురు చెప్పారు నిర్మాత సురేష్ బాబు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ నెలలో ఆడియో విడుదల ఉంటుందన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే యూత్ అమితాసక్తి చూపుతుంటారు. ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఇక పూర్తి ప్యామిలీ ఇమేజ్ సొంతం చేసుకున్న వెంకటేష్ సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు క్యూ ఖాయం. ఇలాంటి ఇద్దరు హీరోలు నటిస్తున్న ‘గోపాలా గోపాలా' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.

హిందీ హిట్ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో, వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తారు. శ్రీయ వెంకటేష్ భార్య పాత్రలో నటిస్తోంది. సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











