గోపీచంద్ నెక్ట్స్ జూన్ నుంచి ప్రారంభం

By Srikanya

హైదరాబాద్ : రీసెంట్ గా వివాహం చేసుకున్న గోపీచంద్ మెల్లిగా తన తదుపరి ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నారు. దేవకట్టా దర్శకత్వంలో కమిటైన చిత్రం జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు స్క్రిప్టు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జి.ఆనంద ప్రసాద్ తమ భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

నాగచైతన్య హీరోగా దేవా కట్టా డైరక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య ' చిత్రం రిలీజ్ బాగా లేటయ్యేటట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు దేవా కట్టా తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సారి యాక్షన్ హీరో గోపీచంద్ ని గోపీచంద్ ని డైరక్ట్ చేయనున్నారు. ఈ విషయమై దేవకట్టా స్వయంగా ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు.

దేవకట్టా ట్వీట్ లో ... "నా తదపరి చిత్రం గోపీచంద్ తో ఉంటుంది. అది ఓ ఓ యాక్షన్ ఎంటర్టైనర్, మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ", అని ట్వీట్ చేసారు. అలాగే... 'ఆటోనగర్ సూర్య' విడుదల గురించి చెప్తూ.. " మీ అందరి లాగే నేను కూడా ఆటోనగర్ సూర్య విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ", అన్నారు.

గోపీచంద్ హీరోగా చేసిన 'సాహసం ' విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రం పూర్తిగా ఎండ్వెంచర్స్ తో నడుస్తుంది. నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తయారవుతోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మైంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ, లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X