‘బాద్ షా’ టీజర్ ఆలస్యంపై గోపీ మోహన్ వివరణ
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' మూవీ ఆడియో తొలుత మార్చి 10న శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయిచడం, భద్రతా కారణాలతో ఈ వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడం, దీంతో ఆడియో వేడుకను మార్చి 17కు వాయిదా వేసుకోవడం తెలిసిందే.
అయితే అభిమానులు నిరుత్సాహ పడకుండా మార్చి 10న 'బాద్ షా' టీజర్ రిలీజ్ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపాలని అనుకున్నారు. దీంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. శివరాత్రి రోజున 'బాద్ షా' చిత్రానికి సంబంధించి ఎలాంటి టీజర్ విడుదల చేయలేదు.
దీనిపై 'బాద్ షా' రచయితల్లో ఒకరైన గోపీమోహన్ తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. బాద్ షా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకందని, రాత్రింభవళ్లు తేడా లేకుండా టీం మొత్తం హార్డ్ వర్క్ చేస్తోందని, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయని, ఇలాంటి తీవ్రమైన ఒత్తడి ఒక వైపు...టెక్నికల్ సమస్యలు మరో వైపు చుట్టి ముట్టాయి. ఈ నేపథ్యంలో 'బాద్ షా' టీజర్ విడుదల చేయలేక పోయామని, త్వరలోనే టీజర్ విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
'ఏ విధంగా చూసినా బాద్ షా స్పెషల్ గా ఉంటుంది. ప్రేక్షకులను ఈచిత్రం గ్రాండ్ గా ఎంటర్ టైన్ చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను. ఈ నెల 17న గ్రాండ్ గా ఆడియో వేడుక జరిపేందుకు ప్రిపేర్ అవుతున్నాం.....ఇప్పటి వరకు జరిగిన అసౌకర్యానికి అభిమానులకు అపాలజీ చెబుతున్నాం' అంటూ గోపీమోహన్ ట్వీట్ చేసారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











