సునీల్ హీరోగా దర్శకత్వంలోకి గోపీ మోహన్
ప్రస్తుతం గోపీ మోహన్ తను తయారు చేసుకున్న స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వైపు సునీల్ ప్రస్తుతం వెట్టై రీమేక్ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నాడు. దీంతో పాటు ఉదయ్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గోపీ మోహన్ తో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
గోపీ మోహన్ మొదట నుంచీ దర్శకత్వ విభాగంలో పనిచేసిన వ్యక్తే. తేజతో కలిసి చాలా సినిమాలకు పనిచేసారు. అయితే మొదటి సారిగా దశరథ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చటంతో ఆయన ఆ రంగంలో బిజీ అయ్యారు. గోపీ మోహన్ మొదటి నుంచి కథా విశ్లేషణ పరంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన దర్శకత్వంలో మంచి చిత్రం వస్తుందని అంతా భావిస్తున్నారు.
పూర్తి స్థాయి ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుగా గోపీ మోహన్ తన కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలన్నింటిలో గోపీమోహన్ కృషి ఉంది. ఇక దూకుడుకి కథ సమకూర్చినా టైటిల్ కార్డులో కథ, స్క్రీన్, దర్శకత్వం, మాటలు... శ్రీను వైట్ల అని వేయించుకున్నారు. దాంతో గోపీమోహన్ మనస్థాపం చెందినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి.


Click it and Unblock the Notifications












