సునీల్ హీరోగా...గోపీ మోహన్ దర్శకత్వం వైపు
హైదరాబాద్: ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్ గోపీ మోహన్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. ఢీ, రెడీ, దుబాయ్ శీను, సంతోషం, వెంకీ, కింగ్, నమో వెంకటేశ తదితర హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన గోపీ మోహన్ తాజాగా సునీల్ హీరోగా రూపొందబోయే సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఈ విషయాన్ని గోపీ మోహన్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ ఖరారు కావాల్సి ఉంది. ఇవి పూర్తయిన తర్వాత సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

గోపీ మోహన్ మొదట నుంచీ దర్శకత్వ విభాగంలో పనిచేసిన వ్యక్తే. తేజతో కలిసి చాలా సినిమాలకు పనిచేసారు. అయితే మొదటి సారిగా దశరథ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చటంతో ఆయన ఆ రంగంలో బిజీ అయ్యారు. గోపీ మోహన్ మొదటి నుంచి కథా విశ్లేషణ పరంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన దర్శకత్వంలో మంచి చిత్రం వస్తుందని అంతా భావిస్తున్నారు.
పూర్తి స్థాయి ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుగా గోపీ మోహన్ తన కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలన్నింటిలో గోపీమోహన్ కృషి ఉంది.


Click it and Unblock the Notifications