మగతనం పరీక్షలు చేయిస్తే.. గోపీచంద్
పెళ్లి ఒద్దంటున్నాడని కొడుక్కి తండ్రి మగతనం పరీక్షలు చేయిస్తే ఆ కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే నా చేత చేయించారు. హీరోతో అలా చిన్న పిల్లాడిలా చేయించకపోతే ప్రేక్షకులు ఆ కేరక్టర్‌లోకి వెళ్లలేరు. ఓ వయసొచ్చిన కొడుకుతో తండ్రి స్నేహితుడిలా ఉండాలని కృష్ణవంశీ చెప్పదలచుకున్నారు. నా యాక్షన్ ఇమేజ్‌ని బ్రేక్ చేయడానికే నా చేత ఆ సన్నివేశం చేయించారు అంటున్నారు గోపీచంద్. ఆయన తన తాజా చిత్రం మొగుడు గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఆ చిత్రంలో ఒక చోట రాజేంద్రప్రసాద్ తన కొడుకు గోపీచంద్ ని తీసుకెళ్లి మగతనం టెస్ట్ లు చేయిస్తారు. అలాంటి సీన్ ఎందుకు పెట్లాల్సి వచ్చిందో వివరించారు గోపీచంద్. అలాగే ఈ సినిమాలో హీరో ఎక్కడా ఓవర్‌గా బిహేవ్ చేయడు. సందర్భానుసారం వ్యవహరిస్తాడు.
నిజ జీవితంలో ఎలా ఉంటానో ఇందులోని రాంప్రసాద్ పాత్ర యాభై శాతం అలా ఉంటుంది. నేను పైకి ఎలా ఉంటానో అలానే ఉంది ఆ సినిమాలో. అందువల్ల నాకేమీ ఓవర్ అనిపించలేదు. తండ్రీ కొడుకుల అనుబంధంలోనూ ఓవర్ లేదు. అందుకే మొదట్నించీ హీరో పాత్రని కృష్ణవంశీ సబ్‌స్టిట్యూట్ చేయిస్తూ వచ్చారు. ఎక్కడ నన్ను లేపితే నా మునుపటి కేరక్టర్ బయటకు వస్తుందేమోనని చాలా తెలివిగా ఆయన ఆ పాత్రని అలా చేయించారు. ఆ ఎపిసోడ్ వల్లే ప్రేక్షకులు అందులో లీనమయ్యారు. హీరో కూడా ఓ మామూలు మనిషే అని చెప్పడానికి అలా చేయించారు అన్నారు. తాప్సీ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం రిలీజైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుని, తర్వాత ప్లాప్ సినిమాగా ముద్రవేయించుకుంది.


Click it and Unblock the Notifications











