సినిమాలో పెడితే సెన్సారు సమస్య..గోపీచంద్
ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో ఆయన చెబుతుంటే అలా వింటుండిపోయాను. అయితే అవన్నీ సినిమాలో పెడితే సెన్సారు సమస్య వస్తుందనే పెట్టలేదు అంటున్నారు గోపీచంద్. ఆయన లేటెస్ట్ రిలీజ్ గోలీమార్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో గోపీచంద్ మాట్లాడుతూ గోలీమార్ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...కథలో ప్రతి సన్నివేశం చాలా గ్రిప్పింగ్‌గా ఉంది, ఆసక్తికరంగా ఉంది. రెండు గంటలపాటు ఈ చిత్రకథను జగన్‌గారు చెప్పారు. డైలాగులతో సహా ఆయన చెబుతుంటే ఇన్‌స్పైర్ అయి విన్నాను. ఈ సినిమా గురించి జగన్‌గారు ఎంతో మెటీరియల్ గాదర్ చేశారు.
ముఖ్యంగా హీరో కారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆ కరేజ్ నెస్, టఫ్ నెస్ బాగా నచ్చాయి. అలాగే హీరోయిన్ పాత్ర, రోజా పాత్ర కూడా బాగా కుదిరాయి. ప్రతి పాత్రకు ఐడెంటిటి ఉంది. ధియేటర్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడే కథ ఇది. అందుకు విన్నవెంటనే ఓ.కె. అనేశాను అన్నారు. పోలీసాఫీసర్ దయానాయక్ స్పూర్తితో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తన కెరీర్ లో మరిచిపోలేని మంచి చిత్రాల్లో ఒకటని గోపీచంద్ చెప్పారు. అలాగే తన తదుపరి చిత్రం గురించి చెబుతూ...బి.గోపాల్ గారి దర్శకత్వంలో నటిస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉండే యాక్షన్ లవ్‌స్టోరీ అది. మరి కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి నిర్మాతలే ప్రకటిస్తారు అన్నారు.


Click it and Unblock the Notifications











