శుభలేఖలు పంచుతున్నా: గోపీచంద్
''శుభలేఖలు వచ్చేశాయి. ఇక పంచడమే తరువాయి. పెళ్లి తరవాతే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాను'' అంటున్నారు గోపీచంద్ చెప్పారు. గోపీచంద్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 24న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకొన్న హరితను వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక.. గోపీచంద్ హీరోగా బాలాజీ రియల్ మీడియా ప్రై.లి. సంస్థ జి.భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఎస్.ఎస్.రాజమౌళి స్విచ్ఛాన్ చేశారు.
అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ ''భూపతి తమిళంలో నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. పోలీసు సినిమా అంటే యాక్షన్ హంగామానే ఎక్కువ. అయితే ఈ చిత్రంలో వినోదం కూడా ఉంటుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఓ పోలీసు కథ ఇది. గోపీచంద్ ఒక్కరే దీనికి న్యాయం చేయగలరనిపించింది. హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. త్వరలో ఆమె పేరు ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, ఛాయాగ్రహణం: శక్తి శరవణన్, సంగీతం: తమన్, కళ: కార్తీక్ రాజ్‌కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: కోమర వెంకటేష్.


Click it and Unblock the Notifications











