గోపీచంద్ కు త్రిషకు ఏమైంది?
మొదటి సారి 'వర్షం' చిత్రంలో కలసి నటించిన గోపీచంద్, త్రిష ఇప్పుడు 'శంఖం' చిత్రంలో నాయికానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం ప్రారంభంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని వినికిడి. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని, వీరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతలో ఏమైందో కానీ ప్రస్తుతం వీరిద్దరూ ఎడముఖం, పెడముఖంలా వుంటున్నారట.
ఇటీవల గోపీచంద్ పుట్టినరోజు సెట్లో జరిగిందట. ఆ వేడుకను అందరూ కలసి సెలబ్రేట్ చేస్తుంటే త్రిష మాత్రం మౌనంగా వెళ్లి తన కారవాన్ లో కూర్చుందట. త్రిష కోసం అందరూ చాలా సేపు ఎదురుచూసినా ఆమె రాలేదట. హీరోగారికి విషెష్ కూడా చెప్పలేదట. దీంతో సెట్ లో వున్న వారంతా ఏమైందీ వీరిద్దరికీ అని చెవులకు పని చెప్పారట.
gopichand trisha shankam birthday varsham king nagarjuna గోపీచంద్ త్రిష శంఖం కింగ్ నాగార్జున పుట్టినరోజు


Click it and Unblock the Notifications