పూరీ'గోలీమార్'టైటిల్ వెనుక
గోపీచంద్..పూరీజగన్నాధ్ కాంబినేషన్లో 'గోలీమార్' అనే చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గోలీమార్' అనే టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ బుల్లెట్స్ తో ప్రత్యర్ధులను చంపుతాడు కాబట్టే 'గోలీమార్' అని పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'ఏక్ నిరంజన్' అనంతరం ఈ చిత్రం ప్రారంభం కావల్సి ఉంది. అయితే వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించనుండటంతో ఈ గోలీమార్ లేటయ్యేటట్లు ఉంది. ఇక ఇంతకుముందు 'సిద్దం'చిత్రంలో జగపతిబాబు,'ఘర్షణ'లో వెంకటేష్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించిన సంగతి తెలిసిందే.
gopichand encounter purijagannath ekniranjan ysr biopic prabhas గోపీచంద్ పూరీజగన్నాధ్ గోలీమార్ రాజశేఖరరెడ్డి వెంకటేష్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్


Click it and Unblock the Notifications