మెగా దర్శకుడితో గోపీచంద్-నయనతార
హైదరాబాద్ : సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర వంటి మెగా హిట్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు బి.గోపాల్ మరో సినిమా ప్రారంభమైంది. గోపీచంద్-నయనతార హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం శుక్రవారం అఫీషియల్ గా చెన్నైలో ప్రారంభోత్సవం జరుపుకుంది.
తెలుగు, తమిళంలో ఒకేసారి ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా గురంచి దర్శకుడు మాట్లాడుతూ...'ఇది ద్విబాషా చిత్రం. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాం. యాక్షన్ ఎంటర్టెనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు మించిన విషయాలేమీ చెప్పలేను. సెప్టెంబర్ 1 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది' అని తెలిపారు.
యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం స్విట్జర్లాండ్‌లో తొలి షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు సాగుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత సౌతిండియాలోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరుపనున్నారు. చాలా కాలంగా గోపీచంద్ సినిమాలు తమిళంలో అనువాదం అవుతున్నాయి. అయితే తొలిసారిగా ఆయన డైరెక్ట్ తమిళ సినిమా చేస్తున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని జయబాలాజీ రియల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. గోపీచంద్, నయనతారల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఇదే. గోపీచంద్ నటించిన సాహసం చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications












