మంచు కుటుంబ చిత్ర దర్శకుడుతో గోపిచంద్ నెక్ట్స్
హైదరాబాద్ : హిట్ ఇచ్చిన దర్శకుడు అంటే అందరికీ మోజే. రీసెంట్ గా మంచు ఫ్యామిలీతో పాండవులు పాండవులు తుమ్మెదా అంటూ హిట్ ఇచ్చిన శ్రీవాస్ తో గోపీచంద్ సినిమా చేయబోతున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. శ్రీధర పీసన అందించిన కథతో కోన వెంకట్,గోపీ మోహన్ స్క్రీన్ ప్లే,డైలాగులతో ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రానికి సైతం గోపీ మోహన్,కోన వెంకట్ పని చేసారు. ఏప్రియల్ నుంచి చిత్రం మొదలువుతుంది. గతంలో వీరి కాంబినేషన్ లో లక్ష్యం చిత్రం వచ్చి విజయం సాధించింది.
ప్రస్తుతం గోపీచంద్..బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.
తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్.


Click it and Unblock the Notifications












