మగ బిడ్డకు తండ్రయిన హీరో గోపీచంద్
హైదరాబాద్: హీరో గోపీచంద్ తండ్రయ్యాడు. ఆయన భార్య రేష్మ సోమవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ సోషల్ నెట్వవర్కింగ్ ద్వారా వెల్లడించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన గోపీచంద్ తన తండ్రి మళ్లీ తమ ఇంట్లో మగబిడ్డగా పుట్టాలనే కోరికతో ఉన్నారు. ఆయన కోరిక మేరకు మగబిడ్డ జన్మించడం విశేషం.

రేష్మకు ఇటీవలే శ్రీమంతం జరిగింది. రేష్మకు సంబంధించిన ఆరోగ్య విషయాలు, గర్భంతో ఉన్న ఆమెను మరింత సంతోషంగా ఉంచడానికి గోపీచంద్ గత కొన్ని రోజులుగా పెటర్నటీ లీవు(పితృత్వపు సెలవు)లో ఉన్నారు. హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో మే 12, 2013న వైభవంగా జరిగింది.
ఈ విషయం తెలియడంతో తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు గోపీచంద్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన సన్నిహితులు కొందరు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అభినందించారు. బిడ్డ పుట్టిన ఆనందాన్ని త్వరలో వేడుకగా చేసేందుకు గోపీచంద్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











