గోపీచంద్ ని 'రంకు మొగడు' అంటున్నారు
యాక్షన్ హీరో గోపిచంద్ ఎప్పుడూ సైలెంట్ కిల్లర్ లా దూసుకు వచ్చి హిట్ కొట్టి పోతూంటాడు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొగుడు కి అస్సలు ఏ హంగామా చేయటం లేదు. అయితే దసరాకు విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్సే ఉన్నాయి. అంతేగాక దశరాకు విడుదల కావటంతో నందమూరి హీరోల సినిమాలుకు ఇది పోటీ అని అందుకే దీనికి టైటిల్ రంకు మొగుడు అని పెడితే బాగుండేదని జోక్స్ కట్ చేసుకుంటున్నారు. వివాహ వ్యవస్ధ చుట్టూ తిరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతోంది. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న ఊసరవిల్లి కూడా దసరా పండుగ స్పెషల్ గా నందమూరి అభిమానులు భావిస్తున్నారు. వీటితో పాటు దసరా సీజన్ లో పౌరాణిక చిత్రాలు బాగా ఆడే అవకాశం ఉంటుందని బాలకృష్ణ అబిమానులు భావిస్తున్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాముడుగా చేసిన శ్రీరామరాజ్యం చిత్రం దసరాకే విడుదల కానుంది. నయనతార సీతగా చేస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనులు లేటు కాకుండా ఉంటే ఎట్టిపరిస్ధితుల్లోనూ దసరాకే విడుదల అవుతుంది. మరో ప్రక్క దూకుడు కూడా దసరా సీజన్ నే క్యాష్ చేసుకోవాలని రంగంలోకి దిగుతోంది.


Click it and Unblock the Notifications











