నిధి వేటలో పడ్డ గోపీచంద్

By Srikanya

గోపీచంద్ త్వరలో నిధి అన్వేషణలో పూర్తిగా మునిగి తేలనున్నాడు. ఆ అన్వేషణ ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో జరగనుంది. గోపీచంద్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన 'ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ సినిమా మొదలైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి గోపీచంద్ కెమెరా స్విచాన్ చేయగా, వ్యాపారవేత్త సత్యరంగయ్య క్లాప్ ఇచ్చారు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ''ఇదొక సాహసంతో కూడుకున్న యాక్షన్ చిత్రం. ప్రపంచదేశాలన్నింటిలో ప్రమాదకరమైనదిగా పరిగణించే ఓ దేశంలో అతివిలువైన ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని ఓ సామాన్యుడు ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం. కథకు తగ్గట్టు జోర్డాన్, రాజస్థాన్, లడక్‌లలో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో గోపీచంద్ పాత్ర, ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో జరిగే ట్రెజర్ హంట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది'' అన్నారు.

అనంతరం హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.


నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ప్రస్తుతం కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఏప్రిల్ తొలివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X