తిరుమలను సందర్శించిన గోపీంచంద్ దంపతులు
తిరుమల : హీరో గోపీచంద్ వివాహం ఈ నెల 12న శ్రీకాంత్ బంధువు రేష్మతో జరిగి విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్ కన్వోస్షన్ సెంటర్లో వీరి వివాహ మహోత్సవం సినీ, రాజకీయ రంగాల ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖలంతా ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కాగా...మంగళవారం ఉదయం గోపీచంద్-రేష్మ దంపతులు తిరుమలను సందర్శించుకున్నారు. వీరివెంట శ్రీకాంత్ కూడా తన ఫ్యామిలీతో కలిసి తరలి వచ్చారు. తిరుమల నిబంధనల మేరకు అంతా సాంప్రదాయ దుస్తులు దరించారు. దర్శనం అయిన వెంటనే తిరిగి హైదరాబాద్ వెళ్లి పోయారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాహసం చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తిరిగి షూటింగులో జాయిన కానున్నాడు. తాప్సి ఇందులో హీరోయిన్. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.
మరో వైపు ఆయన ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో 'జగన్మోహన్ ఐపీఎస్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో నయనతార హీరోయిన్. ప్రముఖ నిర్మాత తాండ్ర రమేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











