పెద్ద హీరోకి 'మనం' స్ఫూఫ్ అవసరమైంది (వీడియో)

By Pratap

హైదరాబాద్ : సాధారణంగా అల్లరి నరేష్ వంటి కామెడీ హీరోల చిత్రాలలో స్ఫూఫ్ కామెడీని ఆశ్రయిస్తూంటారు. ముఖ్యంగా హిట్టైన సినిమాల ప్యారెడీ సన్నివేశాలు కనిపిరస్తాయి. గోపిచంద్ వంటి హీరో చిత్రంలో అలాంటివి ఊహించటం ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే వరస ఫెయిల్యూర్స్ తో ఉన్న గోపిచంద్ సేఫ్ జోన్ లో ఉండటం కోసం కామెడీని ఎన్నుకుని అందులో భాగంగా ఈ ప్యారెడీని తీసుకున్నట్లున్నారు.

అక్కినేని ఫ్యామిలీ కుటుంబ చిత్రం 'మనం'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం పై ఇప్పుడు స్పూఫ్రాబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. గోపీచంద్ తాజా చిత్రం 'లౌక్యం' టీజర్ లో ఈ చిత్రం ప్యారెడీ లాగ అనిపించే సన్నివేశం కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కినేని చివరి చిత్రంగా అందరి ఆదరాభిమానాలు పొందిన ఈ చిత్రం ప్యారెడీ చేస్తారని ఎవరూ ఊహించని విషయం. ఈ వీడియో మీరు చూడండి...

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/-2mScXoANvA" frameborder="0" allowfullscreen></iframe></center>

గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లౌక్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా టీజర్ ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ''భుజ బలం కంటే బుద్ధి బలాన్ని ఎక్కువగా నమ్ముకున్న యువకుడి కథ ఇది. తన వారికి కష్టం కలిగితే ఆతడు ఏం చేశాడనేది చిత్ర ప్రధానాంశం. గోపీచంద్‌ నటనలో వైవిధ్యం ప్రేక్షకులను నచ్చుతుంది''అన్నారు.

Gopichand doing spoof on manam in Loukyam?

అలాగే... ''శ్రీధర్‌ సీపాన నాకు కథ చెప్పినప్పుడు చాలా నవ్వొచ్చింది. ఇంత సరదా కథలుంటాయా అనిపించింది. దర్శకుడిగా ఇదివరకు నేనూ సీరియస్‌ సినిమాలే చేశా. ఇది మాత్రం నన్ను కొత్తదారిలోకి తీసుకెళుతుంది. హంసానందిని కీలకమైన పాటతోపాటు ఓ కీలకమైన పాత్ర కూడా చేసింది'' అన్నారు.

''ఈ నెల 20 నుంచి స్విట్జర్లాండ్‌లోహీరో,హీరోయిన్స్ పై మూడు పాటలు చిత్రీకరిస్తాం. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, కూర్పు: శేఖర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

గోపీచంద్‌ మాట్లాడుతూ ''నవ్వించడమే లక్ష్యంగా చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు శ్రీవాస్‌, రచయిత శ్రీధర్‌ సీపాన కలిసి నాతో ఓ కొత్త రకమైన పాత్ర చేయిస్తున్నారు. నా ప్రయాణంలో వినోదాత్మక చిత్రాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ తరహాలో మరో చిత్రం తెరకెక్కుతుండడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేను, బ్రహ్మానందం, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కలిసి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X