రారాజుగా గోపిచంద్
తొలిప్రేమ, గోదావరి చిత్రాలు నిర్మించిన జివిజి ఫిలింస్ అధినేత జివిజి రాజు తాజాగా గోపిచంద్, మీరా జాస్మిన్ జంటగా నిర్మిస్తున్న చిత్రానికి రారాజు టైటిల్‌ని నిర్ణయించినట్టు తెలిసింది. వెంకటేష్‌తో గతంలో కలిసుందాం..రా వంటి సూపర్‌డూపర్ హిట్ అందించి, తర్వాత కాలం కలిసిరాక అవకాశాలు కోల్పోయిన దర్శకుడు ఉదయ్‌శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరో గోపిచంద్ పేరు కాళీ. మొదట అదే టైటిల్‌గా నిర్ణయించారు. తర్వాత రాజు అనే టైటిల్ కూడా పరిశీలించారు. అయితే రారాజు టైటిల్‌ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ అంకిత కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











