ఇంద్రకీలాద్రికి 'సింహా'...మల్లన్నవద్దకు 'గోలీమార్' గోపీచంద్!
సినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్ కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు. తాజాగా 'సింహా' లో బాలకృష్ణ తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. గురువారం సింహా యూనిట్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గ తల్లిని దర్శించుకున్నారు.
ఇక యువహీరో గోపీచంద్ సైతం తన 'గోలీమార్' చిత్రం సక్సెస్ కావాలని కోరుతూ శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కుకున్నారు. గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన గోలీమార్ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే సింహా చిత్రం ముందు నిన్న విడుదలైన రామరామ కృష్ణకృష్ణ కూడా నిలువలేకపోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గోలీమార్ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. మల్లన్న దయ చూపితే నెగ్గడం ఖాయమని గోపీచంద్ బలంగా నమ్ముతున్నాడు.


Click it and Unblock the Notifications











