twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ 'గోలీమార్' రిలీజ్ డేట్

    By Srikanya
    |

    గోపీచంద్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందున్న 'గోలీమార్' చిత్రం ఏప్రియల్ 24న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది.ఇక నిజానికి దయానాయక్ జీవితం చాలా సినిమాటెక్ లాంటి సంఘటనలతో నిండి ఉంది. కర్నాటకలో పుట్టిన దయానాయక్ ముంబయి చేరుకుని ఓ ఉడిపి రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ ఎస్సై గా జాయిన్ అయి స్ట్రీట్ ఫైట్ లో ఇద్దరు గ్యాంగస్టర్స్ ని చంపటంతో అతను వెనక్కి తిరగాల్సిన అవసరం రాలేదు. ఆయన ఓపెన్ గా ఇప్పటికి ఎనభై ముగ్గురు గ్యాంగస్టర్స్ ని ఎనకౌంటర్ చేసి చంపానని చెప్తూంటారు. ఇక పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు ఆయన బ్యానర్ లో నిర్మించిన అబ్ తక్ చప్పన్ కూడా దయానాయక్ జీవిత సంఘటనలతో తయారైంది. దాన్ని జేడీ చక్రవర్తి తెలుగులోకి జగపతిబాబుతో సిద్దం టైటిల్ తో అనువాదం తరహాలో డైరక్ట్ చేసి అందించారు. ఇక ఈ గోలీమార్ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. అలాగే చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20 న ప్రారంభమై కంటెన్యూ షెడ్యూల్ తో షూటింగ్ జరిగింది. అలాగే ప్రియమణి రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలోనూ చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X