గోపీచంద్ 'గోలీమార్' స్టార్
గోపీచంద్ కథానాయకుడుగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'గోలీమార్' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో గురువారంనాడు ప్రచారార్భాటలకు దూరంగా నిరాడంబరంగా జరిగింది. దేవుని పటాలపై ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీచంద్, సాయిరాం శంకర్, ఆలీ, రవిశంకర్, ఛోటా కె.నాయుడు, చక్రి తదితరులు పాల్గొన్నారు.
ఇదొక ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కథ అనీ, గోపీచంద్ ను ఓ కొత్త యాంగిల్ చూస్తారనీ పూరీ జగన్నాథ్ తెలిపారు డిసెంబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మార్చి నెలాఖరుకు సినిమా పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ వంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం సంతోషంగా ఉందని గోపీచంద్ తెలిపారు. నాజర్, పశుపతి, షవార్ అలీ, రోజా తదితరులు తారాగణం. ఈ చిత్రానికి శ్యామ్ చక్రి సంగీతం అందించనున్నారు.


Click it and Unblock the Notifications











