Rama Banam Twitter Review: రామబాణం మూవీకి అలాంటి టాక్.. అసలైందే మిస్! బాణం దిగిందా అంటే?
ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు గోపీచంద్. తర్వాత ఏ హీరో చేయని విధంగా విలన్ క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యజ్ఞం మూవీతో మళ్లీ హీరోగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత అనేక హిట్ సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాతో మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాపై నెటిజన్ల రివ్యూ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
పెరిగిన అంచనాలు:మ్యాచో హీరో గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్. తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్ మూడోసారి హీరోగా నటించిన చిత్రం రామబాణం. నందమూరి నటిసింహం బాలకృష్ణ చెప్పిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే శ్రీవాస్-గోపీచంద్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగాయి.

ట్విటర్ రివ్యూ:పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం రామబాణం. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించినట్లు తెలుస్తోంది. ముద్దుగుమ్మ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలో రామబాణం ట్విటర్ రివ్యూలోకి వెళితే..
రొటీన్ కథ అయినా:హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో రామబాణం సినిమా ప్రీవ్యూ షోలు పడ్డాయి. వీటి నుంచి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ కత అయినప్పటికీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెబుతున్నారు. మాస్ ఆడియెన్స్ కు మాత్రం కచ్చితంగా బాగా నచ్చుతుందని అంటున్నారు.
బ్రదర్స్ రిలేషన్:రామబాణం సినిమాలో జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారని అంటున్నారు. ఇందులో జగపతి బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెబుతుంటాడు. ఈ సినిమా అంతా కల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించిందని పలువురు చెబుతున్నారు.
అన్నిటి మేళవింపు:రామబాణం చిత్రం మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయిందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. తన అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయట. అలాగే సినిమాలో హీరోయిన్ డింపుల్ తో రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందని వారి అభిప్రాయాలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











