గోపీచంద్, కృష్ణవంశీ చిత్రం ప్రారంభ విశేషాలు
గోపీచంద్, కృష్ణవంశీ కాంబినేషన్ లో రూపొందే చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టుడియోలో గోపీచంద్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి హీరో ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అంతకుముందు ప్రముఖ నిర్మాత డి.రామానాయడు, దర్శకులు రాజమౌళి, కృష్ణవంశీ, హీరో గోపీచంద్, నిర్మాత నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), బ్రహ్మానందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు డి.సురేష్‌బాబు, బ్రహ్మానందం, వల్లభనేని వంశీమోహన్, శ్రీవాస్, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: లక్ష్మీభూపాల్, కళ: హరివర్మ, సంగీతం: కల్యాణిమాలిక్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నరోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లావు వంశీ, సమర్పణ: బేబీ భవ్య.


Click it and Unblock the Notifications











