'బలుపు' లో సీన్ సరిగారాక ఏడుపొచ్చేసింది
'బలుపు'ని అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేయమని తాజాగా మురుగదాస్ అడిగారు. కానీ అప్పుడే బాలీవుడ్‌కి వెళ్లాలనిపించక ఆయన సూచనని కాదన్నాను. భవిష్యత్తులో వెళ్లే ఆలోచన వచ్చిందంటే 'డాన్‌శీను' సినిమానే మళ్లీ తీస్తాను అంటూ ఈ చిత్రం రీమేక్ ఆఫర్ గురించి చెప్తూ వివరించారు. అలాగే... ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు హిందీలోకి వెళ్తున్నాయి. విజయాలూ సాధిస్తున్నాయి. అక్కడ కూడా వినోదాత్మక చిత్రాలకే పెద్ద పీట వేస్తున్నారు. మరి మీరు కూడా బాలీవుడ్‌కి వెళ్తారా అని అందరూ అడుగుతున్నారు. నాకైతే ఇప్పుడే బాలీవుడ్‌కి వెళ్లాలని లేదు. గతంలో రెండు సార్లు అవకాశం వచ్చింది. 'డాన్‌శీను'ని హిందీలో రీమేక్ చేసేందుకు అక్కడి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ అప్పుడు నాకు నచ్చక వెళ్లలేదు. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో ఓ సినిమాను తీయమని కోరారు. అదీ ముందుకెళ్లలేదు అన్నారు.
ఇక శ్రీనువైట్ల దగ్గర పని చేసినప్పుడు కామెడీ టైమింగ్ మీద పట్టు వచ్చింది. మురుగదాస్‌లాగా సందేశాత్మకంగా ఉంటూ వినోదాన్నిచ్చే చిత్రాన్ని చేయాలన్నది నా కోరిక. అందుకే ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించే ఓ చిత్రానికి త్వరలో దర్శకత్వం వహించబోతున్నాను. మరోవైపు పరుచూరి ప్రసాద్, దిల్‌రాజు సంస్థల్లో సినిమాలు చేయబోతున్నాను. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడు. ఇది కూడా వినోదాత్మకంగానే ఉంటుంది. నేను 'కంత్రి' సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నప్పుడే దర్శకుడిగా అవకాశమిస్తానని దిల్‌రాజు అడ్వాన్స్ కూడా ఇవ్వబోయారు. అయితే ఇన్నాళ్లకి ఆయన సంస్థలో పని చేసే అవకాశం నాకు కలుగుతోంది అని అన్నారు.


Click it and Unblock the Notifications












