twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పండగ చేస్కో' నాకు పెద్ద పాఠంలా నిలిచిపోతుంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : '''పండగ చేస్కో'ని థియేటర్లో చూశా. కుటుంబ ప్రేక్షకులంతా ఆస్వాదిస్తున్నారు. 92 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాం. పైగా రెండు సార్లు సమ్మె సమస్యల్ని ఎదుర్కొన్నాం. అన్ని విధాలా 'పండగ చేస్కో' నాకు పెద్ద పాఠంలా నిలిచిపోతుంది'' అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.
    డాన్ శ్రీను చిత్రంతో పరిచయమైన గోపిచంద్ ..తర్వాత బాడీగార్డ్ అంటూ ప్లాప్ ఇచ్చారు. తర్వాత మళ్లీ.. వినోదం, యాక్షన్‌, కాసిన్ని భాగోద్వేగాల మేళవింపుతో 'బలుపు' తీశారు. అదీ విజయవంతమైంది. ఇప్పుడు 'పండగ చేస్కో' అంటూ పక్కా వాణిజ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే...రామ్‌ హుషారైన హీరో. ఆయన శైలికి తగిన కథ ఇది. ఇది మాస్‌కి నచ్చే సినిమా మాత్రమే కాదు. కుటుంబ బంధాలున్న సినిమా.బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్‌ నారాయణ పంచిన వినోదం అందరికీ నచ్చింది. చివర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాపై స్పూఫ్‌లాంటిది చేశాం. ఆ సన్నివేశాలకూ మంచి స్పందన వస్తోంది అని అన్నారు.

    Gopichand Malineni about his latest Pandaga Chesko

    ఇక ''స్వతహాగా నాకు ప్రేమకథలంటే ఇష్టం. 'గీతాంజలి' లాంటి సినిమా తీయాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు వేరు. నిర్మాత, పంపిణీదారులు, ప్రదర్శనకారులు అందరూ లాభపడాలి. అలాంటి సినిమాలే తీయాలి. ఈ విషయంలో నాకు వినాయక్‌గారే అదర్శం. ఇప్పటి వరకు ఆయన సినిమాని కొన్న ఏ ఒక్కరూ నష్టపోలేదు.

    అంతేకాదు 'మీ సినిమా అనే ధీమాతోనే పండగ చేస్కో కొన్నామండీ' అని పంపిణీదారులు అంటుంటే వాళ్ల కోసం సేఫ్‌ గేమ్‌ ఆడడంలో తప్పు లేదనిపించింది. ఇక్కడ ప్రేక్షకులు కోరుకొన్న సినిమాలే ఇవ్వాలి. కొత్తదనం పేరుతో మన భావాల్ని వాళ్లపై బలవంతంగా రుద్దకూడదు'' అని చెప్పుకొచ్చారు.

    కథ రొటీన్ గా ఉందనే విషయమై మాట్లాడుతూ...''కొత్త కథలు తక్కువగా వస్తున్నాయి. ఉన్న కథలనే స్క్రీన్‌ప్లేతో తెలివిగా మలచుకోవాల్సిందే. ఎలాంటి కథ చెప్పినా వినోదం మేళవిస్తూ చెబితే తప్పకుండా ప్రేక్షకులు మెచ్చుకొంటారు. మున్ముందూ వినోదాన్ని నమ్ముకొనే ప్రయాణం సాగిస్తా. ప్రస్తుతం కొత్త స్క్రిప్టులు సిద్ధం చేసుకొంటున్నా. నా తదుపరి చిత్రం ఓ అగ్ర కథానాయకుడితో ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతా'' అని అన్నారు.

    English summary
    Director Gopichand Malineni said that he is very much happy about Pandaga Chesko. And One of the major highlights of the film has been its comedy and one track during the pre-climax rocked. This had ’30 Years’ Prithvi along with Shakalaka Shankar of ‘Jabardasth’ fame posing as brothers. Well, both of them reprised the roles of victory Venkatesh and superstar Mahesh Babu in the movie Seetamma Vaakitlo Sirimalle Chettu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X