రవితేజను ప్లాపుల బాట నుంచి గట్టెక్కిస్తాడట

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ.... వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హిట్ చవిచూసి దాదాపు రెండు సంవత్సరాలైంది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన అరడజనుకుపైగా చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా జోరు తగ్గించకుండా వరుస సినిమాలు చకచకా చేసేస్తూ వెలుతున్నాడు.

ప్రస్తుతం రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్నాడు. ఇటీవల దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రవితేజకు మళ్లీ పాత వైభవాన్ని తెస్తానని చెప్పుకొచ్చారు. ఒక నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయనంటే ఎంతో అభిమానం. రవితేజ నటించిన వెంకీ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాను. అప్పటి నుండే రవితేజతో నా తొలి సినిమా చేయాలని అనుకునే వాన్ని.... దేవుడి దయ వల్ల 'డాన్ శీను' చిత్రంతో నా కోరిక నెరవేరిందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.

'బలుపు' చిత్రం రవితేజ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. రవితేజ ఇందులో పవర్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రేక్షకులకు 'బలుపు' చిత్రం సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. నాకు, రవితేజకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉందని గోపీచంద్ వెల్లడించారు.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. ఈ చిత్రాని తమన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X