మరో రియల్ స్టోరీని సిద్ధం చేస్తున్న క్రాక్ దర్శకుడు.. ఇంతవరకు ఎవరికి తెలియని సంఘటనలతో..

కాంబినేషన్స్ అనగానే ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా భారీ స్థాయికి చేరుకుంటాయి. బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరోతో కమర్షియల్ మాస్ దర్శకులు సినిమా చేస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక రానున్న రోజుల్లో బాలయ్య కూడా తన స్టైల్ కు తగ్గట్లుగా మాస్ దర్శకులతోనే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ క్రాక్ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అడ్వాన్స్ ఇచ్చేసిన నిర్మాతలు

అడ్వాన్స్ ఇచ్చేసిన నిర్మాతలు

గత కొంతకాలంగా బాలయ్య ఒక మాస్ దర్శకుడిని ఫిక్స్ చేసినట్లు టాక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి మైత్రి మూవీస్ నిర్మాతలు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ముందే దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చేసి కథ రెడీ చేయమని చెప్పేశారు. దానిపైనే దర్శకుడు గత కొంతకాలంగా తన రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు.

క్రాక్ సినిమా కంటే హై రేంజ్ లో

క్రాక్ సినిమా కంటే హై రేంజ్ లో

ఇక క్రాక్ సినిమా ఎలాగైతే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుందో అంతకంటే హై రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు. అయితే క్రాక్ సినిమాలో నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా కథను అల్లినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒంగోలులో అప్పట్లో రౌడి షీటర్ గా ఉన్న కటారి కృష్ణ పాత్రను చాలా సీరియస్ గా ప్రజెంట్ చేశాడు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ

ఇక బాలకృష్ణతో చేయబోయే సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. క్రాక్ సినిమాకు ఒంగోలు బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్న దర్శకుడు ఈ సారి రాయలసీమ అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు కూడా గోపిచంద్ మలినేని చెప్పిన లైన్ చాలా బాగా నచ్చిందట.

అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో..

అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో..

రాయలసీమ చరిత్రలో ఎన్నో మరణాలు అప్పట్లో భయాన్ని కలిగించాయి. అయితే అందులో అనంతపూర్ ఫ్యాక్షన్ రాజకీయలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఎవరు టచ్ చేయని కథలు కూడా చాలా ఉన్నాయట. బయట ప్రపంచానికి పెద్దగా తెలియని నిజ జీవిత సంఘటనలను బాలయ్య సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. మరి గోపిచంద్ ఆ రూట్లో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే..

సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే..

ఇక వీరి సినిమాను మే నెలలో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అయిపోగానే గోపిచంద్ మలినేని సినిమాను స్టార్ట్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలియజేశారు. ఇక సినిమా వచ్చే ఎడాది సంక్రాంతి అనంతరం ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X