twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునతో సినిమా చేయట్లేదు: ప్రకటించిన యంగ్ డైరెక్టర్

    |

    రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'మన్మథుడు 2' సినిమా ఫలితంతో ఢీలా పడ్డాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో ఇటు నాగార్జున.. అటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన.. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ సినిమాను ఆయన స్వయంగా నిర్మిస్తారని కూడా వార్తలు వచ్చాయి.

    ఇప్పటికే వరుస పరాజయాలతో బాధ పడుతున్న నాగార్జునకు గోపీచంద్ చెప్పిన ప్రయోగాత్మక కథ నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వస్తున్న వార్తలపై ఈ యంగ్ డైరెక్టర్ స్వయంగా స్పందించాడు. 'నేను నాగార్జున గారితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయనకు నేనే ఎటువంటి కథనూ వినిపించలేదు. అసలు మా మధ్య అటువంటి చర్చలు కూడా జరగలేదు. నేను త్వరలోనే ఓ సీనియర్ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడిస్తాము' అని ప్రకటించాడు.

     Gopichand Malineni clarity about Nagarjuna Movie

    శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన గోపిచంద్.. ఆ తర్వాత ఆయనతో నాలుగు సినిమాలకు పనిచేశాడు. అనంతరం ఈవీవీ సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర 'అందరివాడు', 'వెంకీ', 'ఢీ' సినిమాలకు వర్క్ చేశాడు. వీటితో పాటు మురుగదాస్ దగ్గర 'స్టాలిన్' సినిమాకు, శ్రీవాస్ దగ్గర 'లక్ష్యం' సినిమాకు, అలాగే మెహర్ రమేష్ దగ్గర 'కంత్రి', 'బిల్లా' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 'డాన్ శీను' ద్వారా దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్.. 'పండగ చేస్కో', 'బలుపు', 'బాడీగార్డ్', 'విన్నర్' సినిమాలు చేశాడు.

    English summary
    Tollywood actor Ravi Teja and director Gopichand Malineni have teamed up twice so far for Don Seenu in 2010 and Balupu in 2013, and both these films had turned out to be blockbuster hits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X