Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ తర్వాత సినిమాను ప్రకటించిన డైరెక్టర్.. హ్యాట్రిక్ కొట్టేస్తారా!
స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.
రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇక, ఈ సినిమా తర్వాత అతడు చేయబోయే దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ, తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాత్రం తనతోనే సినిమా చేస్తున్నారంటూ ప్రకటించాడు. అక్కినేని నాగార్జున యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ సినిమాను ఆయన స్వయంగా నిర్మిస్తారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై గోపీచంద్ స్పందించాడు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా చేశాడు.
అదే సమయంలో రవితేజతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. 'నేను నాగార్జున గారితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయనకు నేనే ఎటువంటి కథనూ వినిపించలేదు. అసలు మా మధ్య అటువంటి చర్చలు కూడా జరగలేదు. కానీ, నేను త్వరలోనే ఓ రవితేజ గారితో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడిస్తాము' అని ప్రకటించాడు. దీంతో ఈ జంట 'డాన్ శీను', 'బలుపు' తర్వాత హ్యాట్రిక్ చేయబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.