మెగా హీరోతో రెండో సినిమా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాల తరువాత తేజ్ ఐ లవ్ యు చిత్రంలో నటించాడు. ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఏ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రానికి ఆడియన్స్ నుంచి సరైన స్పందన రాలేదు. దీనితో తదుపరి చిత్రాల విషయంలో తేజు కొంత జాగ్రత్త వహిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజు ఇది వరకే విన్నర్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం నిరాశపరిచింది. ఈ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం ఉంటుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ఉండకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడంతో దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించారు.

సాయిధరమ్ తేజ్ తో సినిమా ఉంటుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం అంటూ గోపిచంద్ మలినేని క్లారిటీ ఇచ్చారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా తేజు త్వరలో నటించబోతున్నాడు.


Click it and Unblock the Notifications