ఘనంగా దర్శకుడు గోపీచంద్ మలినేని పెళ్లి (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ ఇంటివాడయ్యాడు. ప్రేమికుల రోజున శుభముహూర్తాన శ్రీసత్యతో గోపీచంద్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాడు గోపీచంద్.
గోపీచంద్ మలినేని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రవితేజతో 'బలుపు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
శ్రీహరి నటించిన 'పోలీస్' చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గోపీచంద్ మలినేని, ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ గా చేసారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అందరివాడు, వెంకీ, ఢీ, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రానికి, శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం చిత్రానికి, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి, బిల్లా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. రవితేజ హీరోగా 'డాన్ శీను' చిత్రంతో హీరోగా పరిచయం అయిన గోపీచంద్, ఆవెంటనే వెంకటేష్‌తో 'బాడీగార్డ్' సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం రవితేజతో 'బలుపు' చిత్రం చేస్తున్నాడు.

గోపీచంద్-శ్రీసత్య పెళ్లి ఫోటో.

గోపీచంద్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

త్వరలో గోపీచంద్ మలినేని పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన రవితేజతో ‘బలుపు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ‘బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని ‘డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

గోపీచంద్-శ్రీసత్య పెళ్లి ఫోటో.


Click it and Unblock the Notifications











