విమర్శ ఉంది కానీ..నిజం కాదు: 'డాన్ శీను' డైరక్టర్
బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందనే విమర్శ ఉంది. అది నిజం కాదు. 120 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాను 103 రోజులకే సినిమా పూర్తయింది. అందుకు కారణం నిర్మాత వెంకట్ ఇచ్చిన ప్రోత్సాహమే. బడ్జెట్ పరిధులు దాటలేదు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలొచ్చాయి. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాను అంటున్నారు 'డాన్ శీను' డైరక్టర్ గోపిచంద్ మలినేని. రవితేజ, శ్రియ కాంబినేషన్ లో రూపొంది రిలీజైన 'డాన్ శీను' చిత్రం మొన్న శుక్రవారం రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే...డాన్ శీను సినిమాలో మలుపులు ఎక్కువయ్యాయని అంటున్నారు. కానీ ఆ మలుపులే ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే దీంట్లో ఉన్న వినోదం ప్రతి ప్రేక్షకుడికీ నచ్చింది. అదే ఈ సినిమా విజయ సూత్రం. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకొంటున్నారు. చాన్నాళ్ల తరవాత శ్రియ తెలుగులో నటించిన సినిమా ఇది. యువతకు ఆమె నటన నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











