భయంభయంగా, నిద్రపొకుండా 'డాన్ శీను'ని...
"భయంభయంగా, చాలా జాగ్రత్తగా 'డాన్ శీను'ని డైరెక్ట్ చేశా. టెన్షన్ తో నిద్రకూడా పోకుండా పనిచేశా. ఆ ఫలితం ఇవాళ కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది" అంటున్నారు గోపీచంద్ మలినేని. అలాగే తాను నిజానికి ఈ కథని గోపీచంద్‌తో తియ్యాలనుకున్నా. అయితే మొదట ఈ కథని 'బిల్లా'కి పనిచేస్తున్న టైమ్ లో ప్రభాస్ కి చెప్పా. ఆయన బాగుందని చెప్పి ప్రోత్సహించారు. తర్వాత హీరో గోపీచంద్ కి వినిపించా. ఆయనకీ నచ్చింది. రకరకాల కారణాల వల్ల ఆయనతో చేయడం కుదరలేదు. ఆ తర్వాత రవితేజకి ఈ కథ చెప్పా. ఆయనకి ఇది యాప్ట్ సబ్జెక్ట్. విన్న వెంటనే ఓకే అన్నారు. అంతకంటే ముందే నిర్మాత వెంకట్ కి చెబితే, ఆయనా చాలా బాగుందన్నారు. అలా ఈ సినిమా మొదలైంది అన్నారు.
అలాగే...సినిమాలో ప్రధానంగా కనిపించే మలుపులు మూడు. ఆద్యంతం నవ్వుతూనే ఉండే ప్రేక్షకులు ఈ మలుపుల వల్ల మళ్లీ మళ్లీ సినిమా చూస్తున్నారు..రవితేజ, శ్రీహరి కాంబినేషన్ సీన్స్ సెకండాఫ్ లో ఎక్కువగా వస్తాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే బ్రహ్మానందం సన్నివేశాల్ని కూడా అన్నారు. కొత్త దర్శకుడికి రవితేజ అంతటి సౌకర్యవంతమైన హీరో మరొకరు ఉండరు. ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. యాక్టింగ్ సైడ్ కూడా బాగా ఇన్ వాల్వ్ అయి చేస్తారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. సినిమా పరంగా డాన్ అంటే మనకు మొదట గుర్తుకు వచ్చే పేరు అమితాబ్. అందుకే అమితాబ్ అభిమానిగా రవితేజని చూపించా. పైగా అమితాబ్ బాడీ లాంగ్వేజ్ రవితేజలో కనిపిస్తుంది. 'డాన్ శీను' పాత్రకి వంద శాతం న్యాయం చేశారు రవితేజ అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











