సినీ ప్రముఖులతో గోపీచంద్ మలినేని వివాహ రిసెప్షన్ (ఫోటోలు)
హైదరాబాద్: సినీదర్శకుడు మలినేని గోపీచంద్ పెళ్లి రిసెప్షన్ ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ పంక్షన్ కి సినీ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశ్వీరదించారు. బంధు మిత్రులుతో ఈ వేడుక చాలా ఉత్సాహంగా జరిగింది. వివాహం ఏలూరులో జరగటంతో అక్కడికి సిని వర్గాలు వారు పెద్దగా వెళ్లలేకపోయారు. దాంతో ఘనంగా హైదరాబాద్ లో ఇలా ఏర్పాటు చేసారు.
ప్రేమికుల రోజున శుభముహూర్తాన శ్రీసత్యతో గోపీచంద్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గోపీచంద్ మలినేని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రవితేజతో 'బలుపు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
శ్రీహరి నటించిన 'పోలీస్' చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గోపీచంద్ మలినేని, ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ గా చేసారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అందరివాడు, వెంకీ, ఢీ, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రానికి, శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం చిత్రానికి, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి, బిల్లా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. రవితేజ హీరోగా 'డాన్ శీను' చిత్రంతో హీరోగా పరిచయం అయిన గోపీచంద్, ఆవెంటనే వెంకటేష్‌తో 'బాడీగార్డ్' సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు.
పెళ్లికి వచ్చిన సినీ ప్రముఖలు ఫోటోలతో...

తన బాడీగార్డ్ హీరో వెంకటేష్ తో....

వెంకటేష్... దర్శకుడు తల్లి తండ్రులను పలకరిస్తూ...

దగ్గుపాటి రాణాతో.. గోపీచంద్ మలినేని జంట...

తనకు డాన్ శీను లాంటి హిట్టిచ్చిన హీరో రవితేజతో...

రచయిత కోన వెంకట్, రవితేజలతో...

రచయిత బి.వి.యస్ రవి, దర్శకుడు హరీష్ శంకర్ లతో కలిసి...

దర్శకుడు వంశీ పైడిపల్లితో.. కొత్త జంట...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో...

హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డితో కలిసి..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో... కొత్త జంట....

నటుడు రావు రమేష్ తో... గోపీచంద్ మలినేని జంట.

హాస్య నటుడు సత్యం రాజేష్ తో ...

యాక్షన్ హీరో గోపీచంద్ తో కలిసి గ్రూప్ ఫోటో...

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తో..

పాటల రచయిత భాస్కరభట్లతో కలిసి...


Click it and Unblock the Notifications











