మరో హీరో మేనకోడలుతో... స్టార్ హీరో గోపీచంద్ నిశ్ఛితార్దం
హైదరాబాద్ : స్టార్ హీరో గోపీచంద్ నిశ్చితార్దం ఫిక్సైంది. మరో తెలుగు హీరో శ్రీకాంత్‌కు స్వయానా అక్క కూతురు(మేనకోడలు) రేష్మా ని గోపీచంద్ వివాహం చేసుకోనున్నారు. ఈ ఆదివారం ఇరువైపు కుటుంబాలవారు తాంబూలాలు మార్చుకోబోతున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఈ నిశ్చితార్థ వేడుక ముహూరాన్ని ఖరారు చేశారు. కొత్త సంవత్సరంలో ఈ వివాహం జరగనుంది.
గతంలో గోపీచంద్ వివాహం హరిత అనే అమ్మాయితో ఖరారైన విషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. 2012 ఫిబ్రవరి 24న పెళ్లి జరుగాల్సి ఉంది. పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిది. అయితే ఈ వివాహం రద్దైంది. ఈ నిశ్చితార్దం రద్దవటంతో మనస్తాపం చెందిన ఆమె తండ్రి రాంబాబు.. ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుతం గోపీచంద్..... చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి 'జాక్‌పాట్' అనే పేరు పరిశీలిస్తున్నారు. నిధుల అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్, రాజస్థాన్, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ ఎటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం. మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.
చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓ దేశం నుండి ఓ సామాన్యుడు సాహసోపేతంగా నిధిని ఎలా సాధించాడన్నదే ఈ చిత్రం కధాంశమని, అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని జోర్డాన్, రాజస్థాన్, లడఖ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని, ఈ కాలానికి తగ్గట్టుగా 'ట్రెజర్ హంట్' కథను సరికొత్తగా చిత్రంలో చూపిస్తామని, తాను ఇదివరకుచేసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.
నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.


Click it and Unblock the Notifications











