హీరో గోపీచంద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ (ఫోటోలు)
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో గోపీచంద్ వివాహానికి రంగం సిద్ధం అయింది. మే 12, 2013న రాత్రి 2.16 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ మహోత్సవం జరుగనుంది. ఈ మేరకు శుభలేఖలు ముద్రించి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. గోపీచంద్ వివాహానికి సంబంధించిన శుభలేఖను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ పెళ్లాడబోతున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత డిసెంబర్ 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఇంతకుముందు గోపీచంద్‌కు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన హరితతో పెళ్లి నిశ్చయమైనప్పటికీ అనుకోని కారణాలతో అది రద్దయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం గోపీచంద్..... చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాహసం అనే చిత్రంలో నటిస్తున్నారు. తాప్సి ఇందులో హీరోయిన్. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.
మరో వైపు ఆయన ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో 'జగన్మోహన్ ఐపీఎస్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో నయనతార హీరోయిన్. ప్రముఖ నిర్మాత తాండ్ర రమేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ వెడ్డింగ్ ఇన్విటేషన్

గోపీచంద్ హీరోగా విడుదలైన చివరి చిత్రం ‘మొగుడు', వివాహ బంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం విడుదల తర్వాతనే గోపీచంద్ రియల్ లైఫ్ మొగుడుగా మారుతుండటం గమనార్హం.

రేష్మాకంటే ముందు గోపీచంద్ కు ఒక హరిత అనే అమ్మయితో నిశ్చితార్థం జరిగింది. వారు జగపతిబాబు ఫ్యామిలీకి బంధువులనే రూమర్ కూడా ఉంది.

ప్రస్తుతం గోపీచంద్ పెళ్లాడబోతున్న రేష్మా హీరో శ్రీకాంత్ కు మేనకోడలు

గోపీచంద్, శ్రీకాంత్ ఇండస్ట్రీలో పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండానే తమ స్వశక్తితో హార్డ్ వర్క్ చేసి పైకొచ్చారు.


Click it and Unblock the Notifications











