గోపీచంద్ వివాహమాడుతున్నది ఈమెనే(ఫోటో)

మే 12న రాత్రి 2.16 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ మహోత్సవం జరుగనుంది. ఈ రోజు జరిగే ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తరలి వస్తోంది. ఈ ప్రక్కనున్న ఫోటో రేష్మ. గోపీచంద్ కు తగ్గ జోడీ అంటున్నారు.
ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత డిసెంబర్ 23వ తేదీన జరిగింది. ఇంతకుముందు గోపీచంద్‌కు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన హరితతో పెళ్లి నిశ్చయమైనప్పటికీ అనుకోని కారణాలతో అది రద్దయిన విషయం విధితమే. గోపీచంద్ వివాహానికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్ నటించిన సాహసం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ సంపాదించింది. నిధి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ ఎటిఎం బాడీగార్డ్‌గా కనిపించనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











