నందమూరి హీరోలకు మొగుడవుతాడా?
నందమూరి హీరోలిద్దరూ తమ సినిమాలు దసరా రిలీజులు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో వీరితో పోటిపడటానికి గోపీచంద్ రెడీ అవుతున్నాడు.కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మొగడు చిత్రాన్ని కూడా దసరాకే ఎట్టి పరిస్ధితుల్లో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ చేసుకున్నారు.వారు తన సినిమాపై పూర్తి నమ్మంకంగా దసరా విజేతగా నిలుస్తుంనదని చెప్తున్నారు.వివాహ వ్యవస్ధ చుట్టూ తిరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతోంది.తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.అలాగే ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న ఊసరవిల్లి కూడా దసరా పండుగ స్పెషల్ గా నందమూరి అభిమానులు భావిస్తున్నారు.వీటితో పాటు దసరా సీజన్ లో పౌరాణిక చిత్రాలు బాగా ఆడే అవకాశం ఉంటుందని బాలకృష్ణ అబిమానులు భావిస్తున్నారు.బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాముడుగా చేసిన శ్రీరామరాజ్యం చిత్రం దసరాకే విడుదల కానుంది.నయనతార సీతగా చేస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనులు లేటు కాకుండా ఉంటే ఎట్టిపరిస్ధితుల్లోనూ దసరాకే విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











